బీబీపేటలో సంకటమోచన హనుమాన్ జయంతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బీబీపీట్ మండల కేంద్రంలోని శ్రీ నగేశ్వర దేవాలయంలో ప్రవేశించిన సంకట యోజన హనుమాన్ జయంతి వేడుకలను ఆర్యవైశ్య, వాసవి క్లబ్ భాషకి నాగేశ్వర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. శ్రీ నగరేశ్వర ఆలయంలో ప్రతిష్టించిన హనుమాన్ జయంతి వేడుకలలో వేద బ్రాహ్మణుల మంత్రోత్సరాల మధ్య అంగరంగ వైభవంగా మహిళా భక్తులతో పాటు పలువురు భక్తులు ఉదయం నుండి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉదయం నుండి అభిషేకం, సింధూర పూజలతో పాటు మహిళలు మంగళహారతులు సమర్పించారు. ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఆలయం కు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


