దోమకొండలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్…

దోమకొండలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 16 (అఖండ భూమి న్యూస్);

దోమకొండ మండల కేంద్రానికి చెందిన ఆరుగురికి రూ.2,14,500 ఆర్థిక సహాయం

షబ్బీర్ అలీ సహకారంతో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఆశ బోయిన శ్రీనివాస్, సర్పంచ్ ఐరేని నరసయ్య లు చెక్కుల పంపిణీ చేశారు.

శనివారం సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు

ఈ సందర్భంగా మొత్తం ఆరుగురు లబ్ధిదారులకు రూ.2,14,500 విలువైన చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులు అందజేశారు. దోమకొండ గ్రామానికి చెందిన ఐదుగురికి, గొట్టుముక్కుల గ్రామానికి చెందిన ఒకరికి చెక్కులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆశబోయిన శ్రీనివాస్ తెలిపారు.

లబ్ధిదారులలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నల్లపు రమేష్‌కు రూ.60,000, లింగ సక్కుబాయికి రూ.60,000, దూకుడు బాలరాజుకు రూ.32,000, నాగయ్యకు రూ.19,000, శ్రీధర్ బండారికి రూ.23,500, మల్లారెడ్డికి రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందని పేర్కొన్నారు. షబ్బీర్ అలీ సహకారంతో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి,పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, అబ్రబోయిన రాజు, నయీమ్, నేతల మల్లేశం, పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, షమ్మీ, మరి శేఖర్, నర్సింలు,రవి, మహమ్మద్, నిమ్మ బాలరాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!