హెచ్ఐవి నివారణలో భాగస్వాములు కావాలి …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 16 (అఖండ భూమి న్యూస్);
హెచ్ఐవి, ఎయిడ్స్ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వై ఆర్ జి కేర్ లింకు వర్కర్ స్కీమ్ జిల్లా రిసోర్స్ పర్సన్ గర్దాస్ సుధాకర్ కోరారు. శనివారం బీబీపేట మండల కేంద్రంలో ఆయన గ్రామ సర్పంచి ఏదుల్ల సాధ్వికతో పాటు గ్రామ పెద్దలు యువకులతో కలిశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన లింకు వర్కర్ స్కీం ద్వారా గ్రామంలో అందిస్తున్న సేవలను గురించి వివరించారు. హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన కోసం గ్రామంలోని ప్రధాన కూడళ్ళలో గోడ రాతలు రాయించాలని సర్పంచిని కోరారు. హెచ్ఐవి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. తమ సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సేవల విజయవంతనికి అందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. హెచ్ఐవి, ఎయిడ్స్, సుఖ వ్యాధులపై మరింత సమాచారం కోసం 1097 టోల్ ఫ్రీ నెంబర్ కి డయల్ చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమేష్, ఉప సర్పంచ్ ప్రశాంతు, లింకు వర్కర్ బాల్ కిషన్, మాజీ ఉప సర్పంచ్ సాయినాథ్, నాయకులు తేలు సత్యనారాయణ, యువకులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


