కామారెడ్డి జిల్లా చేనేత తుది ఓటర్ల జాబితా విడుదల…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 18 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో చేనేత సహకార సంఘాల తుది ఓటర్ల జాబితా విడుదల
కామారెడ్డి జిల్లాలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా అర్హులైన సభ్యులతో కూడిన తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసినట్లు జిల్లా చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.సాగర్ తెలిపారు.
సంబంధిత సహకార సంఘాలకు చెందిన సభ్యుల వివరాలు, అర్హత ప్రమాణాలను సహాయ సంచాలకుల స్థాయిలో పరిశీలించి తుది సభ్యత్వ జాబితాను అధికారికంగా ఆమోదించినట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ప్రాథమిక ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, పేర్ల సవరణలు, చేర్పులను నిబంధనల ప్రకారం పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను రూపొందించినట్లు తెలిపారు.
ఈ తుది జాబితాను సభ్యుల సమాచారం కోసం కామారెడ్డిలోని జిల్లా చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయ నోటీసు బోర్డుపై, అలాగే సంబంధిత ప్రాథమిక చేనేత సహకార సంఘాల కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచినట్లు వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన తుది ప్రతిపాదనలను రాష్ట్ర సహకార ఎన్నికల అధికారులకు త్వరలో పంపనున్నట్లు తెలిపారు. తదుపరి ఎన్నికల ప్రక్రియ మొత్తం ఈ తుది ఓటర్ల జాబితా ఆధారంగానే కొనసాగుతుందని పేర్కొన్నారు.
అర్హులైన సభ్యులందరూ ఈ విషయాన్ని గమనించి తమ వివరాలను సంబంధిత కార్యాలయాల్లో పరిశీలించుకోవాలని సూచించారు.
ఎం. సాగర్
సహాయ సంచాలకులు
చేనేత మరియు జౌళి శాఖ, కామారెడ్డి.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


