కామారెడ్డి లో నీటి ఎద్దడిని తీర్చిన అపర భగీరథుడు మహమ్మద్ అలీ షబ్బీర్
– ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
మున్సిపల్ చైర్ పర్సన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 19. (అఖండ భూమి న్యూస్) ;
జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం కామారెడ్డి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా, వర్షాకాలం మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ,ముఖ్యంగా ఎండాకాలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడేది.ఆ రోజుల్లో ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపేవారు.
అప్పట్లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ,ఈ నీటి సమస్యను శాశ్వతంగా తీర్చడమే ధ్యేయంగా ఒక తపస్సులా పనిచేశారు.
అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ని ఒప్పించి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి కామారెడ్డికి గోదావరి జలాలను తెప్పించడానికి ఆయన ఒక పెద్ద యజ్ఞమే చేశారు.దాదాపు 110 కిలోమీటర్ల దూరం నుండి పైపులైన్లు వేయించి,మల్లన్న గుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి గ్రామాలకు తాగునీరు అందించారు. తద్వారా దాదాపు పదేళ్ల పాటు కామారెడ్డి ప్రాంతానికి తాగునీటి సమస్య లేకుండా చేశారు.
కానీ ప్రజల అవసరాల దృష్ట నీటి కొరత ఏర్పడుతూ వస్తున్నది.
అభివృద్ధి లో భాగంగా
నూతన పైప్‌లైన్ల ఏర్పాటులో ఎదురైన అటవీ (ఫారెస్ట్), ఆర్‌అండ్‌బి (ఆర్ అండ్ బి) శాఖల అనుమతుల ఆటంకాలను స్వయంగా చొరవ తీసుకుని తొలగించారు. ప్రస్తుతం ఈ పైప్‌లైన్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే,గత ప్రభుత్వ హయాంలో కామారెడ్డి పట్టణానికి వచ్చిన కేవలం 4 ఎంఎల్డి నీటి సరఫరాను,ఏకంగా 19 ఎంఎల్డి కి పెంచే మహా యజ్ఞం విజయవంతం కానుంది.
ఈ వేసవికాలం ప్రారంభం కాగానే షబ్బీర్ అలీ ప్రతిరోజూ అధికారులతో సమీక్షలు జరుపుతూ,కామారెడ్డి పట్టణానికి రోజుకు 8 నుండి 10 ఎంఎల్డి నీటిని అందించడానికి ముందస్తు కసరత్తు చేశారు.గత 10 సంవత్సరాలుగా వేసవి వస్తే కామారెడ్డిలోని ప్రతి వార్డులోనూ వాటర్ ట్యాంకర్లు దర్శనమిచ్చేవి.కానీ, షబ్బీర్ అలీ పట్టుదల,నిరంతర కృషి వల్ల నేడు పట్టణంలో ఎక్కడా వాటర్ ట్యాంకర్ల అవసరం లేకుండా,నల్లా ద్వారానే పుష్కలంగా తాగునీరు అందుతోంది.


