రైల్వే ఉద్యోగులకు భారీ ఊరట..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 19 (అఖండ భూమి న్యూస్);
ఇండియన్ రైల్వేస్ కీలక ప్రకటన, ఇకపై.. రైల్వే ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు.* రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. పదవీ విరమణ పొందిన తర్వాత పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు.పెన్షన్ పత్రాల మంజూరులో జాప్యానికి చెక్ పెడుతూ రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో పదవీ విరమణ పొందిన రైల్వే ఉద్యోగులకు పెన్షన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ రైల్వే బోర్డు ఒక శుభవార్తను అందించింది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ (PFA) నేరుగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను (PPO) జారీ చేసేందుకు అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మే 15, 2026న ఒక ప్రత్యేక సర్క్యులర్‌ను జారీ చేసింది.
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. రిటైర్ అయిన ఏ ఉద్యోగికైనా బ్యాంక్ నుంచి పెన్షన్ డబ్బులు అందుకోవడానికి ఈ పీపీవో అత్యంత కీలకమైన పత్రం. ఇది చేతికి రాకపోతే పింఛను చెల్లింపులు ప్రారంభం కావు. తాజా రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రైల్వే పెన్షన్ చెల్లింపుల విధానంలో కీలక సవరణలు చేశారు.
You may also like
నకిలీ వీసాలతో మస్కట్‌కు వెళ్లే యత్నం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళల అదుపులోకి…
సీఎంఆర్ డెలివరీలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష…
భిక్కనూర్ గిద్ద హరిజనవాడలో ఘనంగా ప్రతిష్ట ఉత్సవాలు…
టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డినీ సన్మానించిన లంబాడ హక్కుల పోరాట సమితి…
మాచారెడ్డి సింగిల్ విండోలో యూరియా బస్తాల గోల్డ్ మాల్..!


