జంగంపల్లి శాకాంబరి రైస్ మిల్లు తనిఖీ చేసిన కలెక్టర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 20 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జంగంపల్లి గ్రామంలోని శాకంబరి రైస్ మిల్లును బుధవారం సందర్శించి, ధాన్యం కొనుగోలు ,అన్‌లోడింగ్ కార్యకలాపాలను సమీక్షించారు.
పరిశీలన సందర్భంగా పీపీసీల వద్ద పెండెన్సీ తగ్గించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత పీక్ ప్రొక్యూర్‌మెంట్ సీజన్ , వర్షాల అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి వాహనాల క్లియరెన్స్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా హెడ్ ఆఫీస్ నుండి సుమారు 85 శాతం బాయిల్డ్ రైస్ అలొకేషన్ ముందుగానే అందినందుకు మిల్లర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్‌లోడింగ్ సామర్థ్యాన్ని పెంచడం మరియు వాహనాల క్లియరెన్స్‌ను వేగవంతం చేయడంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్, , జిల్లా సివిల్ సప్లైస్ అధికారి (డి సి ఎస్ ఓ ), డీఎం సివిల్ సప్లైస్, తహసీల్దార్ డీటీసీఎస్ , తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


