లోన్ రికవరీ పేరుతో వేధింపులకు అడ్డుకట్ట వేస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్బిఐ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 23 (అఖండ భూమి న్యూస్);
• ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త రూల్స్ అమలు.
• రికవరీ ఏజెంట్ల తప్పిదాల వల్ల కస్టమర్ నష్టపోతే బ్యాంకే పరిహారం చెల్లించాలి.
• ఇకపై ఎవరినైనా రికవరీ ఏజెంట్లుగా నియమించడానికి వీల్లేదు.
• ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లేదా గుర్తింపు పొందిన సంస్థల సర్టిఫికేట్ ఉన్న వారినే నియమించాలి.
• రికవరీ ఏజెంట్ల పూర్తి వివరాలు బ్యాంకుల వెబ్‌సైట్, యాప్స్‌లో ముందుగానే ఉంచాలి.
• కస్టమర్ ఇంటికి మొదటిసారి వెళ్లే ముందు కనీసం ఒక రోజు ముందే సమాచారం ఇవ్వాలి.
• ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లను సంప్రదించాలి.
• రికవరీ ఏజెంట్లు సభ్యతగా, మర్యాదగా మాట్లాడాలని ఆర్బీఐ ఆదేశం.
• అసభ్య పదజాలం, బెదిరింపులు, పదే పదే కాల్స్ చేసి వేధించడం పూర్తిగా నిషేధం.
• కస్టమర్ల బంధువులు, సహోద్యోగులను ఇబ్బంది పెట్టకూడదు.
• వ్యక్తిగత వివరాలు, ఆడియో/వీడియో రికార్డింగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిషేధం.
• కస్టమర్ మొబైల్‌లోని కాంటాక్ట్స్, ఫోటోలు వంటి డేటాను యాక్సెస్ చేయడం లేదా స్టోర్ చేయడం నిషేధం.
• లోన్ రికవరీ కోసం మొబైల్ ఫోన్ ఫీచర్లను బ్లాక్ చేసే టెక్నాలజీ వినియోగించకూడదు.
• మొబైల్ కొనుగోలు లోన్ అయితే గడువు ముగిసి 90 రోజులు దాటిన తర్వాత మాత్రమే ముందస్తు నోటీసుతో ఫోన్ లాక్ చేయాలి.
• ఫోన్ లాక్ చేసినా ఇంటర్నెట్, ఇన్‌కమింగ్ కాల్స్, SOS, ప్రభుత్వ భద్రతా అలర్ట్స్ నిలిపివేయకూడదు.
• నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ సర్వీసులు నిలిపితే ప్రతి గంటకు రూ.250 చొప్పున కస్టమర్‌కు పరిహారం.
• రికవరీ కోసం చేసే ప్రతి కాల్ సమయం, నంబర్, సంభాషణను బ్యాంకులు రికార్డ్ చేయాలి.
• కాల్ రికార్డులను కనీసం 6 నెలలు భద్రపరచాలి.
• కోర్టు కేసులు ఉంటే కేసు పూర్తయ్యే వరకు డేటా స్టోర్ చేయాలి.
• కొత్త రూల్స్‌తో రుణగ్రహీతల గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తి రక్షణ కల్పిస్తున్నామని ఆర్బీఐ వెల్లడి చేశారు.
You may also like
కామారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్ లు, హెల్పర్ పోస్టుల భారతీయ నోటిఫికేషన్ జారీ…
ఎస్ ఆర్ ఐ గడువు లోపు ప్రక్రియ పూర్తి చేయాలి…
10 న ఏఐవైఎఫ్ విద్యారంగల సమస్యలపై బంద్…
కే పీ రాజిరెడ్డి జన సేవా ట్రస్ట్ వారి డ్యూయెల్ డిస్క్ బెంచీల పంపిణీ…
*రూ.2.11 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ …


