కాంగ్రెస్ లో చేరిన అంచనూరు ఉప సర్పంచ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 23 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉప సర్పంచ్ కందుకూరి ప్రభాకర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆశ బోయిన శ్రీనివాస ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరినట్లు తెలిపారు. ఉప సర్పంచ్ తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పందిరి ప్రవీణ్ రెడ్డి, మెట్టు కాలాలి, ప్రశాంత్ గౌడ్ లు కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పుకొని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆశ పోయిన శ్రీనివాస్, తాటిపల్లి శ్రీకాంత్, అంచనూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తిరగంటి నరేష్, పందిరి రాంరెడ్డి, గోసానిపల్లి నరసింహులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


