ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేగవంతం చేయాలి…
రోజుకు కనీసం 12 లారీల ధాన్యాన్ని అప్లోడ్ చేయాలి..
అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్, లచ్చాపేట గ్రామాలను. అదనపు కలెక్టర్ విక్టర్ ఆదివారం సందర్శించారు. అనంతరం మాచారెడ్డి గ్రామంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీపీసీ కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి (డీసీవో)తో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
తదుపరి భిక్కనూర్‌లోని సప్తగిరి పీబీఆర్ ఇండస్ట్రీస్‌ను సందర్శించి మిల్లర్‌తో మాట్లాడి ఎలాంటి ఆలస్యం లేకుండా రోజుకు కనీసం 12 లారీల ధాన్యాన్ని అన్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలు పెరగకుండా మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్శనలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


