31న కామారెడ్డి కర్షల్ బిఈడి కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి , వే24,( తెలంగాణ పత్రిక జిల్లా ప్రతినిధి)
కామారెడ్డి ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకురావాలనే ఉద్దేశంతో గత 20 సంవత్సరాలుగా మనం ప్రయత్నాలు చేస్తున్నా గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల కార్యక్రమంలో భాగంగా సెవెంత్ లింకు కెనాల్ అని ప్రకటించి ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలన చేసినప్పటికీ కాలేశ్వరం ప్రాజెక్టు పేరును 21, 22 లింకు కెనాల్ ను మన ప్రాంతానికి గోదావరి జిల్లాలో తరలిస్తామని ప్రకటించారు. పది సంవత్సరాలుగా మనల్ని ఆశల్లో ఉంచారు. ఈ మధ్యలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లింకు కెనాల్కు ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా దాచారం చేస్తున్నారు. కామారెడ్డి లసాధన సమితి తరపున రెండుసార్లు క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా సమితి జల సాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 31న వచ్చే ఆదివారం కామారెడ్డిలో స్థానిక కర్షక్ బి.ఎడ్ కాలేజీ ఆవరణలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైనది. దీనికి స్థానిక ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, అందరూ హాజరై రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆదివారంఒక కరపత్రాన్ని విడుదల చేయడమైనది. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి జిల్లా కన్వీనర్ వై వెంకట్రామిరెడ్డి జలసాధన సమితి నాయకులు టి హనుమాన్లు కే వేణుగోపాల్ కె శ్రీనివాస్ పి అంజయ్య ఫిరంగి రాజేశ్వర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


