కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు…

కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);

*టి పి సి సి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల సంబరాలు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 24 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో ఆదివారం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ,

తెలంగాణ రాజకీయాల్లో కార్యకర్తల హృదయాలను గెలుచుకున్న నాయకుల్లో మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుందని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి, కష్టాన్ని నమ్ముకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే స్థాయికి ఎదగడం ఆయన పట్టుదలకు నిదర్శనం అన్నారు. రాజకీయాలు అంటే పదవులు కాదు.. ప్రజలకు సేవ చేయడమే అనే భావనతో ముందుకు సాగే మహేష్ కుమార్ గౌడ్, ఎప్పుడూ ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు అని అన్నారు. గ్రామీణ సమస్యల నుంచి రాష్ట్ర స్థాయి అంశాల వరకు ప్రతి విషయంపై గళం వినిపిస్తూ, ప్రజల తరఫున నిరంతరం పోరాడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పార్టీ కార్యకర్తలే అసలు బలం అన్న నమ్మకంతో వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు.

సాధారణ జీవన విధానం, అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావం, మాట ఇచ్చితే నిలబెట్టుకునే నమ్మకం మహేష్ కుమార్ గౌడ్‌ను ప్రజలకు మరింత చేరువ చేసింది. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత ఇంకా ఉన్నాయని ఆయన తన ప్రవర్తనతో నిరూపిస్తున్నారు.

పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త దిశను చూపిస్తూ, పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజాసేవే లక్ష్యంగా ఆయన కొనసాగుతున్న రాజకీయ ప్రయాణం మరింత విజయవంతం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో,ప్రధాన కార్యదర్శి, నిమ్మ విజయకుమార్ రెడ్డి, జూలూరి సుధాకర్,ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్,క్రెడా అధ్యక్షులు నర్సాగౌడ్,మున్సిపల్ కౌన్సిలర్లు,గడ్డమీది మహేష్,మాజీ కౌన్సిలర్లు,జమీల్, చింతల రవీందర్ గౌడ్,బల్ల శ్రీనివాస్,సునీల్ గౌడ్,శశి, నిరంజన్,సునీల్ గౌడ్,రాహుల్, ఆబిద్ మెహర్ బాబా గౌడ్, అరుణ్, హైమద్, పాండు, శ్రీకాంత్,ఆకాష్,ఉన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!