ఎమ్మెల్యే సొంత నిధులు తీసుకువచ్చి, మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించాలి.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కామారెడ్డి మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వేంకట రమణా రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం వెనుక అంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసి రివ్యూ మీటింగ్ పెడితే బాగుంటుండేదని అన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ఒక ఆరు ఎకరాల ఒక వెంచర్ కు ఛార్జీ తీసుకున్న 3 రోజులకే కమిషనర్ అనుమతులు ఇచ్చారు. అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఆరోపించారు.
నిజామాబాద్ వ్యక్తులకు చెందిన వ్యక్తుల వెంచర్ కు ఉటావుటిన అనుమతులు ఇప్పించి వారితో స్వలాభం పొంది ప్రభుత్వ స్కూళ్లకు బెంచీలు పంపిణీ చేశారు.
గత వర్షాకాలంలో భారీ వర్షాలకు కూల్చిన రోడ్డు డివైడర్లను తిరిగి నిర్మించే పనులు ఎమ్మెల్యే చేయడం లేదు అన్నారు.
హిందూ స్మశానవాటిక నిర్మాణానికి అన్ని సంఘాల వారితో మాట్లాడి ,అభివృద్ధికి నేను కృషి చేస్తుంటే కొంత మంది ఈ మంచి పనికి కొందరు కలిసి రావడం లేదు అన్నారు.
ఎవరైతే హిందువుల ఓట్లతో గెలిచినారో వారే ఈ హిందూ శ్మశాన వాటిక నిర్మాణానికి కలిసి నడవడం లేదు అని ప్రశ్నించారు.
కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ సలహాదారుగా, ఎమ్మెల్యేగా ఉన్నవారు హిందూ శ్మశాన వాటికలో అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అని ఆరోపించారు.
పది రోజుల్లో జిల్లా కలెక్టర్ ను కలిసి శ్మశాన వాటిక అభివృద్ధికి అనుమతి ఇవ్వాలని కోరబోతున్న అందుకు మిగతా నాయకులు కలిసి రావాలి, లేదంటే అన్ని కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.
పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అక్రమ కట్టడాలను అడ్డుకునే స్థితిలో కామారెడ్డి అధికారులు, ప్రజా ప్రతినిధులు లేరు అన్నారు.
వారం రోజుల్లో పట్టణంలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చకపోతే ఆ కట్టడాల వద్దనే మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో తప్ప గ్రామాలవైపు ఎమ్మెల్యే వెళ్లిన దాఖలాలు లేవు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి పి సి సి) ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పిడుగు మమత, సాయిబాబు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్, గడ్డమీది మహేష్, తాటి ప్రసాద్ లావణ్య, క్రెడా అధ్యక్షులు నర్సాగౌడ్,మాజీ కౌన్సిలర్లు, సలీం,చాట్ల వంశీ, రంగ రమేష్ గౌడ్, కామారెడ్డి సేవాదళ్ యూత్ అధ్యక్షులు, నర్సుల మహేష్, బల్ల శ్రీనివాస్, మెహర్ బాబా గౌడ్, అరుణ్, రాహుల్, శశి, ఆకాష్. ఉన్నారు.
You may also like
మున్సిపల్ లో పనిచేసే వయసు పైబడిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలి…
ఢిల్లీ : జూన్ 1 నుంచి జులై 12 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు…
ప్రజావాణిలో 138 దరఖాస్తులు
*దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు*
కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు…


