ప్రజావాణిలో 138 దరఖాస్తులు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 25 (అఖండ భూమి న్యూస్);
ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 138 దరఖాస్తులు స్వీకరించినట్లు ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఇస్తూ, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజావాణికి వచ్చిన అర్జీలలో భూ సమస్యలు, పింఛన్లు, ఉపాధి, ధాన్యం కొనుగోళ్లు, కుటుంబ సమస్యలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వినతులు ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్ , ఎన్.వి గిరి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆర్డీవోలు, జడ్పీ సీఈవో చందర్, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


