మున్సిపల్ లో పనిచేసే వయసు పైబడిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలి…
మున్సిపల్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పూజారపు రాజన్న..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 25 (అఖండ భూమి న్యూస్);
మున్సిపల్ లో పనిచేసే పేద కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం మున్సిపల్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో కార్మికులతో చర్చించారు. అలాగే 60 సంవత్సరాలకు పైబడిన వారి స్థానంలో వారిని కొనసాగించాలని తీర్మానించడం జరిగింది. లేకపోతే వారి కుటుంబం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సిఐటియూ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ప్లాంటేషన్ వాటర్ వర్క్ నందు స్థానిక సమస్యలపై కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. పని భారం కూడా చాలా పెరిగి, వెంటనే పని భారం తగ్గించి మ్యాన్ పవర్ తగ్గడం వలన మన మున్సిపాలిటీ శానిటేషన్ వాటర్స్ ఏమీలేవు అవి కలలేగానే అన్ని పరికరములు ఉన్నా కూడా జెసిబి, డోజర్ ట్రాక్టర్,
డ్రిల్లింగ్ మిషన్ ,ఇన్ని పరికరాలు ఉన్నాగాని అవి పని చేయడం లేదని అధికారులు చెప్పి కార్మికులతో పనిచేయడం సరికాదని అన్నారు. యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తూ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కందారపు రాజనర్స్ గారీ ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయం మేరకు కమిటీలో కూడా ఒకరికి చోటు కల్పించడం జరిగిందని అన్నారు. కామారెడ్డి మున్సిపల్ వాటర్ వర్క్స్ ప్రధాన కార్యదర్శిగా నర్సింగరావుని కందరపు రాజనర్సు ఆధ్వరర్యలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియమక పత్రం కూడా అందించారు. కార్మికుల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తానని నా సాయి శక్తుల పోరాడి కార్మికుల సమస్యలు ముందుండి భుజాలపై మోస్తూ, వారి వెన్నంటూ ఉండి కార్మికుల సమస్యలు నా ఇంటి సమస్యల భావిస్తూ వారికి న్యాయం చేస్తానని నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు అన్నారు. వారికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో వాటర్ మున్సిపల్ అధ్యక్షులు మిర్జా ఫయాజ్ బేగ్ ,పోతారం ప్రభాకర్, ప్రభు సాయి, ఏ రాజు ,ముధం కృష్ణ, అబ్బాస్, ఇస్మాయిల్, కడెం రాజయ్య సర్కిల్ నాగరాజ్ ,సర్దార్ ,అన్నేపల్లి, శ్రీనివాస్ ,మౌలానా, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
You may also like
ఢిల్లీ : జూన్ 1 నుంచి జులై 12 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు…
ఎమ్మెల్యే సొంత నిధులు తీసుకువచ్చి, మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించాలి.
ప్రజావాణిలో 138 దరఖాస్తులు
*దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు*
కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు…


