*ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో రూ.3.50 కోట్ల గాంధారి స్టేడియం మంజూరు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 26 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో మరో చారిత్రాత్మక అడుగు పడింది. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవతో గాంధారి మండలం కు రూ.3.50 కోట్ల భారీ నిధులతో మినీ స్టేడియం మంజూరైంది.
ఏళ్ల తరబడి గాంధారి ప్రజలు, యువత కలగా ఎదురుచూసిన స్టేడియం నిర్మాణం ఇప్పుడు నిజం కావడంతో మండల వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే మదన్ మోహన్ తీసుకున్న ఈ నిర్ణయం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
గ్రామీణ ప్రాంత యువత కూడా జాతీయ స్థాయిలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకొని క్రీడా రంగ అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్ మోహన్ నిరంతరం కృషి చేస్తున్నారని స్థానిక నాయకులు పేర్కొన్నారు. గాంధారి అభివృద్ధి కోసం ప్రతి అంశంలో ముందుండే నాయకుడిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని ప్రజలు కొనియాడుతున్నారు.
మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడు”, “అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ప్రజానాయకుడు” అంటూ మండల ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రూ.3.50 కోట్ల మినీ స్టేడియం మంజూరు గాంధారి చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


