ఉపాధి హామీ పథకం కూలీలకు ఇంత అన్యాయమా? మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

 

 

నాతవరం మండలం వై డి పేట పంచాయతీ పరిధిలో గల ఎర్రగడ్డ రిజర్వాయర్ ను మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి ఉపాధి హామీ పథకం కూలీలను కలిసి వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సమస్యల పట్ల ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ఉపాధి హామీ పనులు జరిగేటప్పుడు ప్రతిరోజు మంచినీళ్ల ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు ప్రతీ ఒక్కరికీ ఇవ్వాలని అదేవిధంగా టెంట్లు ఏర్పాటు చేయాలని రూల్ ఉందని దాని ప్రకారం చేయటం లేదని వీటిని కష్టపడి పనిచేసే కూలీలకు అందించకుండా ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుందని ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉపాధి హామీ పథకం పనులలో పనిచేస్తున్న కూలీలకు కూలి డబ్బులు కాకుండా ఇరవై నుంచి ముప్పై శాతం డబ్బులు అదనంగా ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని ఇవ్వక పోతే తాను ఇచ్చేవరకు కూలీల పక్షాన పోరాడతానని ఆయన అన్నారు ఎండలో కష్టపడి పని చేసే వారికి సైతం చెల్లింపుల్లో కోత విధించి ఈ ప్రభుత్వం వారికి చేస్తున్న అన్యాయాన్ని గురించి చంద్రబాబునాయుడు గారి దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు ఉపాధి హామీ పనుల పని వేళలు ప్రారంభ సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటలకి మార్చాలని కోరారు తెలుగుదేశం పార్టీ హయంలో పారలు గునుపాంలు అందించామని అటువంటి పని ముట్లు ఈ ప్రభుత్వంలో ఇవ్వకపోగా కూలీలకు పనికి తగిన జీతం ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తూ కులీలను అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు
ఈ కార్య క్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నందిపల్లి వెంకట రమణ మాజీ జెడ్పీటీసి కరక సత్యనారాయణ లాలంరమణ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!