అకాల వర్షాలతో రైతులకు నష్టం కలగకుండా వేగంగా ధాన్యం మిల్లులకు తరలించాలి…

అకాల వర్షాలతో రైతులకు నష్టం కలగకుండా వేగంగా ధాన్యం మిల్లులకు తరలించాలి…

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 27 (అఖండ భూమి న్యూస్);

జిల్లాలో కొనసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు.

కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామంలో ఉన్న గురు రాఘవేంద్ర రైస్ మిల్‌ను తనిఖీ చేసి, ధాన్యం నిల్వలు, రవాణా , మిల్లింగ్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష చేసి ప్రతి రోజు కనీసం 15 లారీల దాన్యం దించుకోవాలి అని మిల్లర్ లను ఆదేశించారు.

అనంతరం శాబ్దిపూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. సదాశివనగర్ మండలంలోని అడ్లూరి ఎల్లారెడ్డి వరి కొనుగోలు కేంద్రం, శ్రీ మన్నారాయణ రైస్ మిల్‌లను పరిశీలించారు.

అకాల వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 1,100 మెట్రిక్ టన్నుల వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,78,000 మెట్రిక్ టన్నుల వరి సేకరణ పూర్తయినట్లు తెలిపారు. ఇందులో ప్రస్తుతం 1,064 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలో ఉన్నట్లు పేర్కొన్నారు.
వర్షాల వల్ల ధాన్యం తడవకుండా వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద నీరు నిల్వ ఉండకుండా కంధకం కాలువలు ఏర్పాటు చేయాలని, ధాన్యం కుప్పలను టార్పాలిన్‌లతో క్రింది నుండి పైకి, పైనుండి క్రిందకు కప్పి ఉంచాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్ ,సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, డి ఎంశ్రీకాంత్, తహశీల్దార్లు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!