బెల్ట్ షాపులు తొలగించాలని
ఎక్సైజ్ సీఐ కు వినతి పత్రం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం
వివిధ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై తక్షణ చర్యలు తీసుకొని వాటిని పూర్తిగా నిర్మూలించాలని కోరుతూ ఎర్వ వేణు దోమకొండ ఎక్సైజ్ సీఐ సుందల్ సింగ్‌కు వినతి పత్రం అందజేశారు.
సర్కిల్ పరిధిలోని ప్రతి గ్రామంలోని పలు ప్రాంతాల్లో బెల్ట్ షాపులు నిర్వహించబడుతుండటంతో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, అధిక ధరలకు అమ్ముతున్నారని, దీనివల్ల కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవనానికి యువత బానిసలుగా మారుతూ వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా బెల్ట్ షాపుల వద్ద మద్యం సేవించే వ్యక్తుల కారణంగా మహిళలు, విద్యార్థులు సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతుండటంతో పాటు సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని వినతి పత్రంలో వివరించారు.
ఈ నేపథ్యంలో గ్రామలలో నడుస్తున్న అక్రమ బెల్ట్ షాపులపై ప్రత్యేక దాడులు నిర్వహించి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎక్సైజ్ శాఖను కోరారు. గ్రామలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…


