ఇంధనం పొదుపు..సైకిల్‌పై సీఎం సతీమణి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30 (అఖండ భూమి న్యూస్);
ఇంధనం పొదుపుగా వాడాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఫడణవీస్ ఆచరణలో పెట్టారు.పెట్రోల్,డీజిల్ ఆదా చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సైకిల్ తొక్కడం ప్రారంభించారు.5-7 కిలోమీటర్ల పరిధిలోని పనులన్నింటికీ సైకిల్‌పైనే వెళ్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు.


