వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు..?

•కాంగ్రెస్ శ్రేణుల నుంచి బలమైన డిమాండ్
•పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్న భువనగిరి ఎంపీ
టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య..
ప్రతినిధి కురుపాటి గణేష్
(అఖండ భూమి)మే 30
యాదాద్రి భువనగిరి..
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడిగా, కార్యకర్తలకు అండగా నిలిచే వ్యక్తిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు..ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, పార్లమెంట్ వేదికగా ప్రజల తరఫున గళమెత్తుతున్న ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది..ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని గ్రామీణ నమస్యలు, యువత ఉపాధి, అభివృద్ధి అంశాలపై చురుకుగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు పేర్కొంటున్నారు..అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లోనూ ముందుంటున్నారని చెబుతున్నారు..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు పార్టీ తరఫున గట్టిగా సమాధానం ఇస్తూ, తన రాజకీయ అవగా హనతో బలమైన స్వరంగా నిలుస్తున్నారని పార్టీ నాయకులు అంటున్నారు..గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, యువతలో కాంగ్రెస్ పై విశ్వాసం పెంచడం, కార్యకర్తలకు అండగా నిలవడం వంటి అంశాల్లో ఆయన పాత్ర ప్రత్యేకమని పేర్కొంటున్నారు..ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తోపాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) చామల కిరణ్ కుమార్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించాలని భువనగిరి పార్లమెంట్ పరిధి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు…
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…


