ముదిరాజ్ పెద్దమ్మ పరివార్ పాండి నూతన కమిటీ ఎన్నిక…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 31 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని నూతన ముదిరాజ్ పాండి 33 మంది సభ్యులతో పెద్దమ్మ గుడిలో ఆదివారం ఏర్పడింది. ఇప్పటివరకు దోమకొండలో తొమ్మిది ముదిరాజ్ పాండీలు ఉండగా నూతన కమిటీతో దోమకొండలో 10 వ పాండీగ పెద్దమ్మ పరివార్ ఏర్పడింది.
నూతన కమిటీకి ముదిరాజ్ పెద్దమ్మ పరివార్ పాండిగా నామకరణం చేశారు ఈ సందర్భంగా దోమకొండ పెద్దమ్మ ఆలయంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీ సభ్యులను ప్రకటించి, బాధ్యతలను అప్పగించారు.
నూతన పెద్దమ్మ పరివార్ కమిటీ అధ్యక్షుడిగా గాండ్ల రాములు, ఉపాధ్యక్షులుగా కామిండ్ల రాజయ్య (కరాటే), భూపాల్ విజయానంద్, కోశాధికారిగా మడతల స్వామి, కార్యదర్శిగా మడతల భూషణం, ఉప కార్యదర్శిగా శ్యామల గోపాల్, సంఘ సమాచార దారుడిగా అబ్రబోయిన స్వామిలను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పెద్దమ్మ తల్లి సేవలో అంకితభావంతో పనిచేస్తూ, సంఘ అభివృద్ధికి, సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాండి సభ్యులు, పెద్దలు, భక్తులు మరియు గ్రామస్థులు పాల్గొని నూతన ముదిరాజ్ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…


