గోదావరి జలాలు కామారెడ్డికి రావాలని జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం…

గోదావరి జలాలు కామారెడ్డికి రావాలని జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 31 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక బీఈడీ కళాశాలలో

జల సాధన సమితి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో 20, 21, 22 ప్యాకేజీలో భాగంగా 22వ ప్యాకేజీ పనులు సాగటం లేదని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కామారెడ్డి లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 21, 22 ప్యాకేజీలను మార్చినటువంటి కెసిఆర్ ప్రభుత్వం ఎట్లాంటి నిధులు వెచ్చించకుండా తాత్సారం చేసింది. ఇప్పటికే పుష్కర కాలం గడిచిపోయింది . ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలను మోసం చేస్తుందనీ అన్నారు. ఈ సమావేశంలో ప్రధాన వక్తగా మాట్లాడిన రిటైర్డ్ ఇంజనీర్ గోపాల్ కేవలం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో, నిధులు ఇవ్వకపోవడంతో మాత్రమే ఈ ప్రాజెక్టు పనులు సాగటం లేదని 20వ ప్రాధాన్యతగా ఈ ప్రాజెక్టును నిర్ణయించిందని, దానికోసం ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తేనే తప్ప పనులు ప్రారంభం కావని అన్నారు. కేవలం 2000కోట్లతో మాత్రమే పూర్తయ్యే ఈ ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలతో ఇతర ప్రాజెక్టులకు కేటాయించుకుంటున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. అందుకే ఈ ప్రాంత రైతాంగం ప్రభుత్వాలు చేస్తున్న మోసాల నుండి బయటపడి సరైన విధంగా ఉద్యమించాలని తెలియజేశారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరొక వక్త రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పేరున తెలంగాణ డబ్బులు పూర్తిగా తన సొంతంగా వాడుకున్నాడని తన ఫామ్ హౌస్ కు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను కొనుగోలు చేసి ఆ ప్రాంతానికి కాలేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాడని తెలియజేశారు. నిర్లక్ష్యంతో ఈ ప్రాంత రైతులు మోసపోతున్నారని దానికి ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని, ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు రైతాంగం మేల్కొని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని తెలియజేశారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.హన్మండ్లు మాట్లాడుతూ గత 2005 సంవత్సరంలో బిబిపేట చెరువు నుండి నిజామాబాద్ కలెక్టరేట్ వరకు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించిన నిజామాబాద్ కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు, ఈ ప్రాంతానికి గోదావరి జలాలే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయమని 22వ ప్యాకేజీని పూర్తి చేస్తేనే ఈ ప్రాంత రైతులు సుభిక్షంగా ఉంటారని తెలియజేశారు. అధ్యక్ష వర్గం కన్వీనర్ జగన్నాథం మాట్లాడుతూ ఒకప్పుడు ఈ ప్రాంతానికి నీళ్లు రావని చెప్పినటువంటి నాయకులు తాగునీరు, సాగునీరు కోసం షబ్బీర్ అలీ చేసిన ప్రయత్నాన్ని అభినందించారనీ అదేవిధంగా ఈ 22వ ప్యాకేజీకి తగిన నిధులు ఏర్పాటు చేసి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కో కన్వీనర్ ఫిరంగి రాజేశ్వరి మాట్లాడారు ఈ ప్రాంత ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందని, ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, తప్పక ఉద్యమిస్తేనే రైతులు బాగుపడతారని మండల కమిటీలు ఏర్పాటు చేసుకొని ఉద్యమించాలని కోరారు. కన్వీనర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా గోదావరి నీళ్ల కోసం ఉద్యమిస్తున్న ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వెంటనే 22 ప్యాకేజీ పనులు ప్రారంభించాలని కోరారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా బిఎల్ఎఫ్ నాయకులు సిరిగాద సిద్దరాములు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ పీవీఎస్ఎన్ రాజు, కే శ్రీనివాస్. పి ఆంజయ్య, వెంకట లక్ష్మి,

అనసూయ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!