అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల్లో సత్తా చాటిన గిరిజన డిగ్రీ కళాశాల విద్యార్థులు
– తొమ్మిది మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 31 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థులు అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల ఎంపికలో విశేష ప్రతిభ కనబరిచారు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఫలితాల్లో కళాశాలకు చెందిన మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస స్వామి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాశాల నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులు అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికవుతూ దేశ భవిష్యత్తు, భద్రతలో భాగస్వాములు కావడం గర్వకారణమని అన్నారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు బనోత్ సునీల్, నేనావత్ జీవన్, బదావత్ నవీన్, కేతావత్ రాజేష్, కొంగా రోహిత్, శ్రీహరి, బానోత్ క్రాంతి, ఈశ్వర్, అశ్వత్ యాదవ్‌లను ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా అభినందించారు.
అలాగే 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ ప్రవేశాల కోసం మూడో దశ దోస్త్ నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ప్రవేశాలు పొందదలచిన విద్యార్థులు నేరుగా కళాశాలను సందర్శించవచ్చని లేదా 79010 97707 నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
You may also like
కాకి వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శంకుస్థాపన…
రక్తదానంతో మానవత్వాన్ని చాటుతున్న శ్రీహరి…
బాన్సువాడ డివిజన్లో శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక యు డి ఐ డి (సదరం) క్యాంపు…
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…
కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…


