*జర్నలిస్టులకు రెయిన్‌కోట్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 6 (అఖండ భూమి న్యూస్);
వర్షాకాలంలో విధులు నిర్వహించే జర్నలిస్టులకు ఉపయోగపడేలా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రెయిన్‌కోట్లను పంపిణీ చేశారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు రెయిన్‌కోట్లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎండలు, వర్షాలు, ఇతర ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలకు సమయానుకూలంగా సమాచారాన్ని చేరవేస్తూ జర్నలిస్టులు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని అన్నారు.
వర్షాకాలంలో వార్తల సేకరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటించే మీడియా ప్రతినిధులకు రెయిన్‌కోట్లు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు.
జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో మీడియా పాత్ర ఎంతో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా పరిపాలనకు మీడియా ఎల్లప్పుడూ సహకరిస్తోందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్వి గిరి, డి పి ఆర్ ఓ తిరుమల, డిపిఓ మురళి, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రింట్ అండ్,ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సమాచార శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
You may also like
సౌత్ క్యాంపస్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఎదగాలి…
*రాహుల్ గాంధీ అరెస్టు చేయడం సరికాదు…
చేనేత సహకార సంఘ అధ్యక్షుడికి సన్మానం …
సిపిఎస్ రద్దు కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన టి ఎస్ సి పి ఎస్ ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ…
రాహుల్ అరెస్టుకు నిరసనగా కుత్బుల్లాపూర్ లో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ…


