గ్రామీణ ప్రజల సమన్వయంతోనే గ్రామ అభివృద్ధి…
సంగమేశ్వర్ లో గ్రామ సభ విజయవంతం..
సంగమేశ్వర్ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాసరావు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 10 (అఖండ భూమి న్యూస్);
గ్రామీణ ప్రజల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా సంగమేశ్వర్ లో గ్రామసభ విజయవంతమైనట్లు స్థానిక సర్పంచ్ లోయపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన గ్రామసభ సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు. తడి చెత్త, పొడి చెత్త, స్వచ్ఛత, పరిశుభ్రత, గ్రామంలో అభివృద్ధి పనులతో పాటు ప్రణాళిక ప్రకారం భవిష్యత్ ప్రణాళిక అభివృద్ధికై సమన్వయంతో పనిచేసి గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరం ఉందని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ప్రజలు, గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ పాలకవర్గం సభ్యులతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గ్రామాల అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందని అన్నారు. ఆయా శాఖల అధికారులు వివిధ అభివృద్ధి పనులపై ప్రజలకు దిశా, నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వామి, వార్డు సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి, శాఖల అధికారులు,జిపి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


