కామారెడ్డి అభివృద్ధి , సమస్యలపై ఎజెండాలో చేర్చి సమావేశం నిర్వహించాలి…

కామారెడ్డి జిల్లా ధి ప్రతినిధి, జూన్ 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి అబివృద్ధి పై, వార్డుల వారిగా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ ఎజెండాలో చేర్చి పూర్తి స్థాయి ఎజెండా తో వారం రోజుల్లోగా మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలని కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ లు గురువారం డిమాండ్ చేశారు.
మున్సిపల్ సమావేశం అనంతరం బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ నేడు జరిగిన మున్సిపల్ సమావేశంలో చైర్ పర్సన్ గారు ప్రవేశ పెట్టిన ఏకైక ఏజెండా కామారెడ్డి పట్టణ హౌసింగ్ బోర్డు స్మశాన వాటిక అభివృద్ధి పనులను చేయటానికి కలెక్టర్ సూచన మేరకు ఎస్సార్ ఫౌండేషన్ వారికి అనుమతుల అంశానికి బీజేపీ పూర్తి మద్దతు తెలపడం జరిగింది. కానీ అభివృద్ధి ప్రారంభించే ముందు డి పీ ఆర్ మున్సిపల్ ముందు ఉంచాలన్నారు.
అంతే కాకుండా నూతన మున్సిపల్ పాలక వర్గం ఏర్పాటు అయిన నాటి నుండి అభివృద్ధి పనులపై ఎలాంటి చర్చ జరగలేదని, పాత బిల్లులు ఇవ్వడంతోనే సమావేశాల కాలం గడిచిపోతుందని, వచ్చే రెండు మూడు రోజులు 49 వార్డు కౌన్సిలర్ ల ద్వారా వార్డు సమస్యలను తెలుసుకోవాలన్నారు. వాటిని ఆధారంగా చేసుకొని ఎజెండా తయారు చేసి మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ తరుపున కోరినట్లు తెలిపారు. అభివృద్ధి, సమస్యల పరిష్కారం గురించి ఆలోచించాలి ,కానీ బిల్లుల చెల్లింపుల గురించి సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కౌన్సిలర్లు పాల్గొన్నారు.
You may also like
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి…
దోమకొండ ఊరడమ్మకు గడికోట వారసులు బోనాల సమర్పణ…
బిఆర్ఎస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరిన గైని శ్రీనివాస్ గౌడ్…
క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ ముందు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


