సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన గడ్డం ఇందుప్రియ… 

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన గడ్డం ఇందుప్రియ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 12 (అఖండ భూమి న్యూస్);

*కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియపైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీకి శుక్రవారం ఫిర్యాదు చేశారు.

*మాజీ మంత్రి షబ్బీ అలీ తోపాటు తనయుడు ఇలియాస్ షేరు, ముక్తార్, పర్వేజ్ అలియాస్ ( కత్తిపోట్లు) పైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

పార్టీలో ఉండి, అమ్ముడుపోయే వ్యక్తి షబ్బీర్ ఆలీనే అని వ్యాఖ్యానించారు.

షబ్బీర్ అలీపై ఉమెన్స్ కమిషన్ కి, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తాం అన్నారు.

మహిళ అయినా నేను ఎదగడం ఒరవలేకనే నా మీద దృశప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు.

నా మీద సోషల్ మీడియా, ఫేస్బుక్ వాట్సాప్ పెట్టిన అభ్యంతరకరమైన పోస్టుల పెట్టారన్నారు.

నేను గతంలో కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేశాను. ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ నాయకురాలిగా క్రియాశిలకంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. దీనిని సహించలేక కొంతమంది వక్తులు పక్కా ప్రణాళిక, పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. గతంలో 17–07-2005 రోజున ఇదే విధంగా నాపై సోషల్ మీడియాలో 11-07-2025 రోజున సోషల్ మీడియాలో ఆసత్య ప్రచారం చేసిన మహమ్మద్ ఇసాక్ షేరు పై కేసు నమోదు చేయడం జరిగింది అని అన్నారు. నా మీద సోషల్ మీడియాలో నాపై కాంగ్రెస్ నాయకులపై ప్రచారం చేస్తున్నారు. ఇందులో షబ్బీర్ అలీ అనుచరుడు పర్వేజ్ అహ్మద్ , షేర్ ముక్తార్ కామారెడ్డి జిల్లా ఫేస్బుక్ అడ్మిన్ వీళ్ళిద్దరితో పాటు ఇర్ఫాన్, కేఫ్ లో ఫేస్బుక్/ వాట్సాప్ నందు నాపై అసత్య ప్రచారాలు, అసాంఘిక కార్యకలాపాలు అని నిందలు వేస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ నన్ను మనోవేదనకు గురి చేస్తున్నారు అని అన్నారు.ఈ ఫేస్బుక్లో అడ్మిన్ లో ముక్తార్ జన్మదిన వేడుకల్లో ఇసాక్ షేరు, అస్రర్, ఇతరులు కలిసి జరిపించారు అని అంతేకాకుండా పర్వేజ్ అహ్మద్ గతంలో తేది: 20-05-2007 లో జరిగిన కామారెడ్డి కత్తి పొట్ల ఘటన గజరతక్తి హత్యలో ఇతను ప్రధాధ నిందితుడు, సుమారు 15 సంరాల తరువాత కామారెడ్డి కి తిరిగి వచ్చి నేడు కామారెడ్డిలో హిందువులు, మహిళలు పట్ల అభ్యతరకరమైన పోస్టులు పెడుతూ, మత విద్వంసకర, విద్వేశాలు రెచ్చగోడుతున్నారు అని ఆరోపించారు. దీనికి ప్రధాన సూత్రధారులు మహమ్మిద్ ఇసాక్ షేర్, మహమ్మర్ ఇలియాజ్ వారి నాయకత్వ బలంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అని ఆరోపించారు.

శాంతియుతంగా ఉన్న కామారెడ్డిలో ఒక హిందూ మహిళా గురించి అసభ్య పదజాలం వాడినందుకు

ఇరువర్గాల మధ్య ఘర్షణలు ఏర్పడే అవకాశాలున్నాయి అని అన్నారు. మహమ్మద్ పర్వేజ్ అహ్మద్ అనే వ్యక్తి ప్రజలలో, కార్యకర్తలతో నాకు పోలీస్ శాఖ లో మంచి సంభంధాలున్నాయని నాకు షబ్బీర్ అలీ కుటుంబ సభ్యుల అండదండలున్నాయని, నేనేం చేసిన ఆయన యొక్క ఆదేశాలను బహిరంగంగా ప్రకటించు కుంటున్నాడు అని అన్నారు.

ఇలాంటి సంఘ విద్రోహశక్తులను, మతసామరస్యాన్ని , దెబ్బ తీసే వ్యక్తులను కఠినంగా శిక్షించి, చట్ట రీత్యా వారిపై తగిన చర్యలు తీసుకొని మహిళలకు నాయం చేయడు రని, వారి నుండి మా రక్షణ కల్పించగలరని కోరుతున్నట్లు తెలిపారు.

ఈ అంశం టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి పేర్లు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియా, ఎస్సీ సెల్ మహిళా రాష్ట్ర కార్యదర్శి పిడుగు మమత, రంగ మాధవి, డీడీసీ ఉపాధ్యక్షులు నిమ్మ విజయకుమార్ రెడ్డి, పంపరి లక్ష్మణ్, డిసిసి జనరల్ సెక్రెటరీ జూలూరి సుధాకర్,మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, తాటి లావణ్య ప్రసాద్,మాజీ కౌన్సిలర్లు సలీం, రంగ రమేష్ గౌడ్,చాట్ల వంశీ దీక్షిత, పిడుగు మమత సాయిబాబా, శంకర్రావు, జమీల్, చింతల రవీందర్,మామిళ్ళ రమేష్, కామారెడ్డి సేవాదళ్ యూత్ అధ్యక్షులు నర్సుల మహేష్,సుదర్శన్,బండారి శ్రీకాంత్,బల్ల శ్రీనివాస్, అరవింద్, వేణు,కోటేశ్వర్, అరుణ్, ఆబిద్, ఇమ్రోస్, సల్మాన్,మున్ను,రాహుల్, పండు శ్రీకాంత్, శశి, షాహిద్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!