మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ శోచనీయం

జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్;12 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వేసిన రాజ్యసభ నామినేషన్‌ను కుట్రపూరితంగా సాంకేతిక కారణాలతో ఎన్నికల కమిషన్ తిరస్కరించడం శోచనీయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేయగానే హడావిడిగా రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించడం కుట్ర పూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు ఒక మహిళ నేతను అందులోనూ బలహీన వర్గాల కోసం నిజాయితీ,నిబద్ధత కలిగి గాంధేయ మార్గంలో పోరాడే మహిళా నాయకురాలిని రాజ్యసభకు వెళ్లకుండా బీజేపీ అడ్డుకోవడం తగదన్నారు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా అపహాస్యం చేస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్నామని ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం తగదన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని రాజ్యాంగం విలువలను కాపాడాలన్నారు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నందున న్యాయ వ్యవస్థ పై నమ్మకముందని న్యాయం తప్పకుండా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


