ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
– జిల్లా ఎస్పీ యం .రాజేష్ చంద్ర, చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ
కామారెడ్డి ప్రతినిధి జూన్ 11. (ప్రజాజ్యోతి)
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం (వరల్డ్ డే అగనిస్ట్ చిల్దు లేబర్) సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర, చేతుల మీదుగా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ సమాజ అభివృద్ధికి ఆటంకమని, ప్రతి చిన్నారికి విద్య, రక్షణ మరియు మంచి భవిష్యత్తు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు.
ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ మరియు వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరంపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదులు. వారిని పనుల్లో నిమగ్నం చేయడం వల్ల వారి శారీరక, మానసిక మరియు విద్యా అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. అందువల్ల 14 సంవత్సరాల లోపు పిల్లలను ఏ విధమైన పనుల్లోనూ నియమించరాదని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధిత శాఖలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, బాల కార్మికులను గుర్తించి వారికి విద్యా అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా బాల కార్మికులను పనుల్లో పెట్టుకోకుండా, అలాంటి ఘటనలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
“బాల్యం చదువుకోడానికి – పని చేయడానికి కాదు” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సాధన సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గిరిజ, సీఎస్‌ఎం మమత, సంధ్యారాణి, విశ్వజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం – ప్రతి చిన్నారికి విద్య, రక్షణ మరియు సంతోషకరమైన బాల్యం అందిద్దాం.
You may also like
డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి…
దోమకొండ ఊరడమ్మకు గడికోట వారసులు బోనాల సమర్పణ…
బిఆర్ఎస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరిన గైని శ్రీనివాస్ గౌడ్…
క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ ముందు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
*అగ్నిపత్ ఆర్మీకి నలుగురు దోమకొండ యువకులు ఎంపిక…


