డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి…
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 11 (అఖండ భూమి న్యూస్);
రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిజిపిఎస్సి ద్వారా విడుదల చేసిన డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీలో విద్యార్హతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కల్పించడం సరియైన నిర్ణయం కాదని,ఈ పోస్టు పాఠశాల విద్యకు సంబంధించినది కావున బిఈడీ, ఏంఈడీ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు బాలు ప్రభుత్వానికి కోరారు.
ఈ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది అభ్యర్థులు ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నప్పటికీ వారికి అవకాశం కల్పించకుండా కనీస అర్హతగా పీజీని నిర్ణయించడం సరికాదని అన్నారు.20 సంవత్సరాల క్రితం ఉన్న నియామక విధి విధానాలనే ప్రస్తుతం యధాతధంగా అమలుపరిచే ప్రయత్నం చేయడం భవిష్యత్ విద్యావ్యవస్థను ఇబ్బందులకు గురి చేస్తుందని అభిప్రాయపడడం జరిగింది. వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ లో మార్పులు చేపట్టాలని సూచించారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


