దోమకొండ ఊరడమ్మకు గడికోట వారసులు బోనాల సమర్పణ…

దోమకొండ ఊరడమ్మకు గడికోట వారసులు బోనాల సమర్పణ…

ఊరడమ్మకు మొక్కులు చెల్లించుకున్న కామినేని అనిల్ శోభన..

ఊరడమ్మ బోనాల సమర్పణలో పాల్గొన్న విదేశీయులు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 11 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గురువారం దోమకొండ గడికోట వారసుడు కామినేని అనిల్, శోభన లు దోమకొండ గ్రామస్తులతో కలిసి ఉరడమ్మకు బోనాలను సమర్పించారు. గత నాలుగు నెలల క్రితం ఊరడమ్మ ఉత్సవాల కోసం గ్రామస్తులకు సహకరించిన గడికోట వారసులు ప్రత్యేక బోనాలను అమ్మవారికి సమర్పించారు. గ్రామ పురవీధుల నుండి డప్పు వాయిద్యాలతో, గ్రామస్తుల సందడితో బోనాలను భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించి అనంతరం ఆనంద్ భవన్ వరకు తీసుకెళ్లారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సందడి చేశారు. దోమకొండ గడి కోట అభివృద్ధి తరుపున నిర్వహిస్తున్న ఆనంద్ భవన్ లో చిన్నారులను పలకరించి ఫోటోలు తీసుకున్నారు. గ్రామస్తులతో కలిసి ఫోటోలు తీసుకున్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి ఎప్పుడు ఉంటుందని అన్నారు. దోమకొండ గడికోట వారసులతో పాటు విదేశీయులు ఉత్సవాలను, ట్రస్ట్ పనులను, కోటను తిలకించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచ్ హరే ని నరసయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ తో పాటు మాజీ జెడ్పిటిసి తీగల తిరుమలగౌడ్, జిపి పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!