బిఆర్ఎస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరిన గైని శ్రీనివాస్ గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 11 (అఖండ భూమి న్యూస్);
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత సమక్షంలో కామారెడ్డి జిల్లా టి ఆర్ ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జి సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో గురువారం చేరారు.
కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కామారెడ్డి,పంచముఖి హనుమాన్ ఆలయ,మాజీ చైర్మన్ గైని శ్రీనివాస్ గౌడ్ బి ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ లో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కవిత ఈ సందర్భంగా మాట్లాడుతు. టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ప్రతి గ్రామాన, మండలాల, జిల్లాలో జెండా గద్దెలు నిర్మించి జెండావిష్కరణ చేయాలని. కవిత గైని శ్రీనివాస్ గౌడ్ కు ఆదేశించారు. టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కామారెడ్డి నియోజకవర్గంలో కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు రంగు నవీన చారి, సదాశివనగర్ మండల టిఆర్ఎస్ నాయకులు సాయ గౌడ్, సతీష్, సాయి కుమార్ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
You may also like
మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నూతన శక్తులతో ఎమ్మార్పీఎస్ ను బలోపేతం చేద్దాం…
ప్రాంగణ నియామకాల్లో 23 మంది సోషల్ వర్క్ విద్యార్థుల ఎంపిక …
ప్రజావాణిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…
ఆర్ఎంపి, పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం…
*దోమకొండలో పెన్షన్లు పంపిణీ పరిశీలించిన మాజీ జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…


