అఖండభూమి వెబ్ న్యూస్ :
వేపాడమినీ గోకులాల బిల్లులు తక్షణమే చెల్లించండి
ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ డిమాండ్
విజయనగరం జిల్లా వేపాడ మండలం లో K. G పుడి పంచాయతీ లో
రైతు నిర్మించుకున్న మినీ గోకులాలకు నాలుగేళ్లు పూర్తి కావస్తున్న బిల్లులు చెల్లించకపోవడం రైతులు అన్యాయం చేయడమే అన్నారు , మినీ గోగులాలు నిర్మించండని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గానీ, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రైతులను అన్యాయం చేయడమేనని ఏపీ రైతు సంఘం జిల్లా ఉప అధ్యక్షులు చల్లా జగన్ అన్నారు,, సందర్భంగా రైతులతో కలిసి వేపాడ ఎంపీడీఓ కు వినతిపత్రం అందించారు ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ అప్పులు చేసి షెడ్ లు నిర్మించిన రైతులు గగ్గోలు పెడుతున్నారు , ఏడాది క్రితం కొంత పార్ట్ బిల్లులు చెల్లించి అధికారులు ఊరుకున్నారు ,, రైతుల ఆందోళ ఆందోళన నేపథ్యంలో గతంలో నిర్మించే గోకులాలకు ఈనెల 30 లోపు నిర్మించిన షెడ్ల స్థితిని పరిశీలించి పేమెంట్లు ఇవ్వండని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా కింద స్థాయి అధికారులు మాత్రం గోకులాల బిల్లులు పట్టించుకోలేదు
అప్పటి పశు వైద్యఅధికారులు చెప్పిన విధంగా వారు చెప్పిన బ్రాండ్ వారు చెప్పిన కొలతలతో మెటీరియల్ వాడి సెట్లు నిర్మించారు,, 6 పశువుల చెడ్డకు 1.8 లక్షలు,4 పశువుల చెడ్డకు 1.2 లక్షలు పేమెంట్ ఇస్తామని రైతులతో చెప్పి షెడ్లో నిర్మించేటట్టు చేశారు
కానీ ఎంతో ఉత్సవంతో పశువుల రక్షణ కోసం సొంత పెట్టుబడి తో షెడ్లో నిర్మించిన రైతులకు అప్పులు బాధలే మిగిలాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇప్పటికైనా పర్యవేక్షించి పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోతే మండల జిల్లా స్థాయిలో ఉద్యమం నిర్మిస్తామని రై సంఘం నాయకులు చల్లా జగన్, మిడతన పరదేశి నాయుడు హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో షెడ్ లో నిర్మించిన రైతులు అప్పలనాయుడు, ముమ్ములూరి సాయి, గొల్లు చందర్రావు, కిలపర్తి సత్తిబాబు, గొళ్ళు ఎర్రన్న , రొంగళి రామమరావు తదితరులు పాల్గొన్నారు