రాజకీయనాయకుల మౌనమే రాయలసీమకు అన్యాయం. రాజకీయనాయకుల చెవుల్లో సీసం పోసుకున్నారు.

 

 

రాజకీయనాయకుల మౌనమే రాయలసీమకు అన్యాయం.

రాజకీయనాయకుల చెవుల్లో సీసం పోసుకున్నారు.

కర్ణాటకలో అప్పర్ భద్ర, సంగమేశ్వరంలో బ్రిడ్జి కం బ్యారేజ్ పై నోరు విప్పరు. రాయలసీమకు శత్రువులు రాజకీయనాయకులు, సినీ పరిశ్రమ. రాయలసీమ హక్కుల కోసం చలో ఢిల్లీ  రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయనాయకుల మౌనం వహించడంతోనే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని, చెవుల్లో సీసం పోసుకున్నారని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ నేతలపై నిప్పులు చెరిగారు.

శుక్రవారం నంద్యాలలో పాత్రికేయుల సమావేశంలో రాయలసీమ నేతల చేతగాని తనంతో రాయలసీమకు శాపం గా మారిందని, తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకుల మౌనంతోనే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని, చెవుల్లో సీసం పోసుకోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో అప్పర్ భద్ర డ్యామ్ కడుతున్నా, సంగమేశ్వరం వద్ద తీగెల వంతెన బదులు బ్రిడ్జి కం బ్యారేజ్ కోసం రాయలసీమ నాయకులు మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాయలసీమకు ప్రధాన శత్రువులు రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ అన్నారు.

52 నియోజకవర్గాల్లో సేవ్ రాయలసీమ పేరుతో సంతకాల సేకరణకు అందరూ ఆదరిస్తున్నారని, లక్షమంది సంతకాలు చేసి మద్దతు తెలిపారని వివరించారు .

రాయలసీమలోని కడప,కర్నూల్,చిత్తూరు,అనంతపురం జిల్లాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, తీగెలవంతెన ఏర్పాటుచేస్తే సెల్ఫీలు, సినిమా షూటింగులకు మాత్రమే పనికి వస్తుందని అన్నారు.

బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మస్తే 60 టీఎంసీ ల నీరు నిలువచేస్తే రాయలసీమ ప్రాంతావాసులకు నీటి సమస్య ఉండదని అన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర డ్యామ్ నిర్మిస్తే రాయలసీమకు ఉరితాడులాంటిదని గమనించాలని, కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ లో పూడికల వల్ల కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు,రాయలసీమలో 4 జిల్లాలు తెలంగాణలో కొన్ని ప్రాంతాల ప్రజలు నష్టపోతారని అన్నారు. కర్నూల్ ఎస్టీబిసి కళాశాలలోనే నష్టపోయామని గుర్తుచేశారు. 1952 లో జవహర్ లాల్ నెహ్రు కర్నూల్ లోని ఎస్టీబిసి కళాశాలలోనే కర్నూల్ రాజధానిగా ప్రకటించారని, కేవలం మూడేళ్లకే రాజధానిని తరలించుకుపోతున్న అడిగిన నాధుడే లేరన్నారు. అప్పర్ భద్ర కడుతున్నా,బ్రిడ్జ్ కం బ్యారేజ్ కట్టకపోయినా, రిజర్వాయర్లు కట్టకపోయినా, రాజధాని తరలిపోతున్నా నేతలకు కావాల్సింది ఓట్లు, పదవులు తప్ప రాయలసీమ ప్రజల కష్టాలు పట్టడం లేదని ఎద్దేవా చేశారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న నేతల మౌనంతో రాయలసీమ ప్రజలు మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయరాజధాని పేరుతో న్యాయవాదులనే మోసం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కృష్ణా బోర్డ్ విశాఖపట్నంలో పెట్టినా అడిగే దమ్ము నాయకులకు లేదన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులు, ఐటి, పొలాలకు నీళ్లు, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక వలస కూలీలు, నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లి హోటల్స్ లో కప్పులు కడుక్కునే దుస్థితికి మన పాలకులే కారణమన్నారు. జాతీయ ప్రాజెక్టులు రాయలసీమకు ఎందుకురావడం లేదో నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.

పార్లమెంటులో డివిజన్ బిల్లు పాస్ చేసింది వట్టిమాటలేనా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ను ఎలా నమ్మాలో అర్థం కాని పరిస్థితి అన్నారు. రాయలసీమలో ఖనిజ సంపదనను దోచుకుపోతున్నారని పేర్కొన్నారు. తిరుమలలో విలువైన సొత్తు కనపడకపోయిన ప్రశ్నించేవారు లేరన్నారు. రాయలసీమలో వేమన,త్యాగయ్య,అన్నమాచార్యులు, పోతులూరి వీరబాహ్మం పుట్టినగడ్డలో రాజకీయ నాయకుల చేతకాని తనంతో నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ వారి స్వలాభం కోసం రాయలసీమ వాసుల బాంబులు, కత్తులు, హత్యలు, రక్తపాతాలు జరుగుతాయని సినిమాల్లో చూపించడం వల్ల ఎక్కువ నష్టం వాటిల్లిందని అన్నారు. రాయలసీమ సమస్య కోసం త్వరలో చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామన్నారు రాయలసీమ గల్లీ, గల్లీల్లో జై రాయలసీమ నినాదాలు చేస్తామని ప్రత్యేక రైళ్లలో వేలాది మంది తో త్వరలో ఢిల్లీ కి ర్యాలీ చేపడతామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు . రాయలసీమ బాగుకోసం రాజకీయనాయకులు ఇప్పటికైనా గళం విప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు యం. ఎస్. నవీన్ కుమార్, యం. వి. రమణారెడ్డి, గోపాల్ యాదవ్, నందకుమార్ యాదవ్, శివ ప్రసాద్ రెడ్డి, బీమవరం రామచంధ్రారెడ్డి, మునగాల తూము శివారెడ్డి, శ్రీలక్ష్మి, చెన్నమ్మ, తదితరులు పాల్గొని సంతకాల సేకరణ, కరపత్రాలు పంపిణి చేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!