చిన్నారులకు అక్షరాభ్యాసం చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…

చిన్నారులకు అక్షరాభ్యాసం చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 16 (అఖండ భూమి న్యూస్);

బడిబాట కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.

లింగంపేట మండలంలోని

శెట్‌పల్లి జడ్పీహెచ్ఎస్) అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి వారి విద్యాభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు.

అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి పలక, బలపాలను అందజేశారు. చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యను పొందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల హాజరు, అభ్యాస నైపుణ్యాల పెంపు, ప్రాథమిక విద్య బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యా రంగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని సన్మానించి అభినందించారు.

అనంతరం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నియంత్రణ కేంద్రాన్ని సందర్శించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక కిరాణా దుకాణాల యజమానులకు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించే డబ్బాలను , టిఫిన్ బాక్స్ లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో RDO ,

DEO, MPDO సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!