*కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ స్పష్టం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; 18 (అఖండ భూమి న్యూస్);
ఖరీఫ్ – 2026 సీజన్‌లో ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో *2,40,880 యూరియా సంచులు రైతులకు పంపిణీ చేయబడగా, *85,080 మంది రైతులు యూరియాను సేకరించుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో అత్యధిక యూరియా పంపిణీ జరిగిన టాప్-5 మండలాల్లో *ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన రెండు మండలాలు చోటు దక్కించుకోవడం విశేషం.
*గాంధారి మండలం* – *25,890 యూరియా సంచుల పంపిణితో జిల్లాలో ప్రథమ 1వ స్థానంలో నిలిచింది.
*సదాశివనగర్ మండలం 19,733 యూరియా సంచుల పంపిణితో నాలుగో (4వ) స్థానంలో నిలిచింది.
ఈ గణాంకాలు జిల్లాలో యూరియా సరఫరా సక్రమంగా కొనసాగుతోందని, రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలో యూరియా కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వ్యవసాయ శాఖ అధికారిక గణాంకాలు ఆ ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడిస్తున్నాయి.
అందువల్ల రైతు సోదరులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, అవసరమైన యూరియాను సమీప వ్యవసాయ సహకార సంఘాల విక్రయ కేంద్రాల ద్వారా సేకరించుకోవాలని సూచించారు.


