అంబరిపేటలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రహాలు పనుల ప్రారంభం…

అంబరిపేటలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రహాలు పనుల ప్రారంభం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 18 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేట్ గ్రామంలో సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ ఆధ్వర్యంలో గురువారం, పాఠశాల ప్రహరీ గోడ పనులను శంకుస్థాపన చేశారు. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రహరీ గోడ పనులకు పురుగంటి ప్రభాకర్ రావు ఆర్థిక సహాయంతో 15 లక్షల కూడిన పనులనకు శంకుస్థాపనలు చేశారు. ప్రభాకర్ రావు మేనకోడలు దూరవి నిర్మల, సత్యం రావు చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సత్యం గౌడ్, ప్రధాన ఉపాధ్యాయ శ్రీనివాస్, తిరుపతి రెడ్డి,, ఉపాధ్యాయ బృందం,, గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!