ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 19 (అఖండ భూమి న్యూస్);

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి టి-స్వాన్ ద్వారా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ ఎన్ వి. గిరి,సమందిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి తిరిగి సేకరిస్తారని తెలిపారు. ఓటరు జాబితా పరిశుద్ధత, ఖచ్చితత్వం కోసం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని సూచించారు.

జిల్లాలోని బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించాలని,

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో తరచూ సమావేశాలు నిర్వహించి, వారి సూచనలు స్వీకరించాలని పేర్కొన్నారు.

ఈ నెల 23వ తేదీన జుక్కల్ లో శిక్షణ బి ఎల్ ఓ లకు ఇవ్వనున్నట్లు తెలిపారు.

బి ఎల్ ఓ లు తప్పని సరిగా ఐడి కార్డులు వేసుకోవాలని అన్నారు.

జూలై 24వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేయడం, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం పూర్తిచేసి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వివరించారు.

వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు మీడియా, సోషల్ మీడియా, బ్యానర్లు, హోర్డింగ్ల ద్వారా ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్, ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులు , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!