ఫరీద్‌పేట్ సర్పంచ్ నిధుల ఉల్లంఘన: కలెక్టర్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు…
*సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం..?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 20 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (టి జి ఎస్ ఈ సి) తీవ్రంగా స్పందించింది. సర్పంచ్ నరసింహారెడ్డి తన అధికార బలంతో భార్య జీడిపల్లి లతకు కాంట్రాక్టులు కట్టబెట్టి, రూ. 9,61,937 ల ప్రజాధనాన్ని స్వాహా చేశారంటూ సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం కార్యదర్శి జి. లింగ్యా నాయక్ (ఐ ఏ ఎస్ ), సదరు ఫిర్యాదును కామారెడ్డి జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారికి బదిలీ చేస్తూ తక్షణ చర్యల నిమిత్తం అధికారిక నోటీస్ (ఎల్ టి. నెంబర్.779/టి జి ఎస్ ఈ సి – పి ఆర్/2026) జారీ చేశారు.
ఒకే పనికి రెండు సార్లు బిల్లులు తీసుకోవడం, క్షేత్రస్థాయిలో లేని డ్రైనేజీ పనులకు నిధులు నొక్కేయడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులను మళ్లించడం వంటి తీవ్ర ఆరోపణలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ నోటీసులో స్పష్టం చేసింది. ఈ నోటీసు ప్రతిని జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ) కి కూడా పంపడంతో, సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


