అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (చెస్ నెట్‌వర్క్) – కాకతీయ సాండ్‌బాక్స్ ఆధ్వర్యంలో చెస్ బోర్డుల పంపిణీ…

అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (చెస్ నెట్‌వర్క్) – కాకతీయ సాండ్‌బాక్స్ ఆధ్వర్యంలో చెస్ బోర్డుల పంపిణీ…

అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (చెస్ నెట్వర్క్)..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 4:(అఖండ భూమి న్యూస్);

జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హైస్కూల్, కామారెడ్డిలో మంగళవారం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (చెస్ నెట్‌వర్క్), కాకతీయ సాండ్‌బాక్స్ , ఆత్మచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్. ఎస్ నారాయణ గుప్తా , అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలంగాణ యూనివర్సిటీ మాట్లాడుతూ, విద్యార్థులను సంపూర్ణ వ్యక్తిత్వంతో తీర్చిదిద్దడంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యాసంస్థలు విశిష్ట పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. క్రమశిక్షణకు ఈ పాఠశాలలు మారుపేరని పేర్కొన్నారు.

చెస్ ఆటలో రాణించాలంటే ఏకాగ్రత ఎంతో అవసరమని, ప్రస్తుతం పిల్లలు మొబైల్ ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడుతున్న నేపథ్యంలో చెస్ వంటి మేధోక్రీడలు వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన “ఖేలో ఇండియా” కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు చెస్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ప్రత్యేక అతిథిగా పాల్గొన్న శ్రీ రంగా వెంకటేశ్వర్ గౌడ్ గారు, జిల్లా యువజన స్పోర్ట్స్ అథారిటీ అధికారి మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. నేటి తల్లిదండ్రులు పిల్లలను ఉద్యోగాల కోసమే చదివిస్తున్నారని, క్రీడాకారులుగా ఎదగాలని ప్రోత్సహించే వారు చాలా తక్కువగా ఉన్నారని ఆన్నారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డా. శ్యాంసుందర్ , ఉపాధ్యక్షులు గంగారెడ్డి , జిల్లా కార్యదర్శి గీరెడ్డి రాజిరెడ్డి , సంచాలన సమితి అధ్యక్షులు బొడ్డు శంకర్ ,ప్రతాప్ గౌడ్ , ముప్పారప్ ఆనంద్ , రాజేందర్ గౌడ్ గారు, శ్రీ గోపాలకృష్ణ , విభాగ్ శైక్షణిక్ సంయోజక్ శ్రీ పక్కి శ్రీనివాస్ గారు, పాఠశాల ప్రధానాచార్యులు నల్ల నాగభూషణం , అకాడమిక్ ప్రిన్సిపాల్ నాగేష్ , ఇందూర్, కామారెడ్డి జిల్లాలకు చెందిన వివిధ పాఠశాలల ఆచార్యులు, మాతాజీలు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులకు చెస్ బోర్డులను పంపిణీ చేసి, చెస్ ఆటను విస్తృతంగా అభ్యసించాలని ప్రోత్సహించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!