కుమారుడి జన్మదినం సందర్భంగా రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…
*నిస్వార్ధంగా రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సామల సంతోష్ రెడ్డి..
*రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో సదాశివ నగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సామల సంతోష్ రెడ్డి కుమారుడు మహన్ష్ రెడ్డి మూడవ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేయడమే కాకుండా,యువతలో రక్తదానం పట్ల అవగాహనను కల్పిస్తూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఇటీవలే రక్తదాన శిబిరాన్ని నిర్వహించి సామల సంతోష్ రెడ్డి ఆదర్శంగా నిలవడం జరిగిందని,కామారెడ్డి రక్తదాతల సమూహ పిలుపుమేరకు వారి కుమారుడు మహాన్ష్ రెడ్డి మూడవ జన్మదినం సందర్భంగా 48 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని అన్నారు. రక్తదాతకు అభినందనలు తెలియజేశారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


