గౌడ్ సమాజ అభ్యున్నతికి “గోపా” వేదికగా సేవలు …

గౌడ్ సమాజ అభ్యున్నతికి “గోపా” వేదికగా సేవలు …

డాక్టర్ బండి సాయన్న గౌడ్..

– కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..

– సభ్యులచేత ప్రమాణం చేయించిన ముఖ్య అతిథి డాక్టర్ బండి సాయన్న గౌడ్..

– కామారెడ్డి జిల్లాలో 5 వేల సభ్యత్వమే లక్ష్యమని ప్రకటించిన నూతన కమిటీ

– మేధావుల వేదికగా గోపా..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 26 (అఖండ భూమి న్యూస్);

గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (“గోపా”) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం శుక్రవారం (26 జూన్ 2026) ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సభకు రంగా వెంకటేశ్వర్లు గౌడ్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ, గౌడ్ సమాజ అభ్యున్నతికి అధికారులు, ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ అందరూ ఒకే వేదికపైకి వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలో విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ భాగస్వామ్యం పెంపొందించడంలో “గోపా” కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

జిల్లా కమిటీ ఏర్పాటు ద్వారా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గౌడ్ యువత, విద్యార్థులు, ఉద్యోగులను సంఘటితం చేసి సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు.*

*ఈ కార్యక్రమానికి గోపా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యల్మకంటి మీరయ్య గౌడ్, ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, కామారెడ్డి ఆర్‌టిఓ ప్రదీప్ గౌడ్, గట్టుపల్లి నరేష్ గౌడ్, ఉప్పునూతల రమేష్ గౌడ్, నిజామాబాద్ గోపాజిల్లా అధ్యక్షులు మెడ్డుల వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు అతిథులుగా హాజరై ప్రసంగించారు.*

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో 5 వేల సభ్యత్వాలను నమోదు చేయడం తమ లక్ష్యమని ప్రకటించారు.

సభ్యులందరి సమక్షంలో ఈ క్రింది నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు:

జిల్లా అధ్యక్షులు: రంగా వెంకటేశ్వర్ గౌడ్

ప్రధాన సలహాదారు: ఉప్పునూతల రమేష్ గౌడ్

ప్రధాన కార్యదర్శి: లింగాల రాజబాబు గౌడ్

కోశాధికారి: నడిల్లా యాదగౌడ్

ఉపాధ్యక్షులు: అంకన్నగారి నాగరాజ్ గౌడ్, అనుగూనూరి కృష్ణ గౌడ్

ఆర్గనైజింగ్ సెక్రటరీ: బాబా గౌడ్

జాయింట్ సెక్రటరీలు: డాక్టర్ పల్సా హరీష్ గౌడ్, సుదీమ్ కృష్ణ గౌడ్, తిమ్మక్‌పల్లి శివ గౌడ్

సెక్రటరీలు: చింతకింది స్వామి గౌడ్, పాతింటి నరేందర్ గౌడ్, బట్టుపల్లి రేణుక గౌడ్, అరుణ గౌడ్

సలహాదారులు: బొర్ర రాజు గౌడ్, కొడిపాక నరేందర్ గౌడ్, జనగాం శ్రీనివాస్ గౌడ్

కార్యనిర్వాహక సభ్యులు: మర్రిపల్లి స్వామి గౌడ్, దేవోళ్ల ఎల్లా గౌడ్

ఈ సందర్భంగా సభలో పాల్గొన్న అతిథులు, నాయకులు నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ, గౌడ్ సమాజ సేవలో మరింత చురుకుగా పనిచేసి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!