మాచారెడ్డి లో వివాహానికి హాజరైన ప్రభుత్వ సలహాదారుడు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు గణేష్ నాయక్ కుమారుని వివాహ విందుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందమయం, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ సురేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్, మాజీ పట్టణ అధ్యక్షులు రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నౌసిలాల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


