*ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
*పంట మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించాలి..
*చెరువులు, కుంటలకు నీరు వచ్చే పోయే కాలువలు పూడిక తీయించి శుభ్రంగా ఉంచాలి..
*గత సంవత్సరం వరదల కారణంగా ఏర్పడిన బుంగలు, అలుగుల మరమ్మత్తులు చేయించాలి..
*కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖ అధికారులతో వేరు వేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ. పంటలు విత్తే సమయం ఆసన్నం ఆయన సందర్భంగా ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలనీ, పంట మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించాలనీ, పంట మార్పిడి ద్వారా కలిగే లాభాలను రైతులకు వివరించాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని అధికారికంగా రైతులకు కలగాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
నీటి పారుదల శాఖ అధికారుల సమీక్షా సమావేశం లో జిల్లా కేంద్రం సహా గ్రామాల్లోని చెరువులు, కుంటలకు నీరు వచ్చే పోయే కాలువలు పూడిక తీయించి శుభ్రంగా ఉంచాలనీ, చెట్లు మొక్కలు లేకుండా చూడాలని అన్నారు. గత సంవత్సరం వరదల కారణంగా ఏర్పడిన బుంగలు, అలుగుల మరమ్మత్తులు చేయించాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


