కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీఫ్ షబ్బీర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 25 (అఖండ భూమి న్యూస్);
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో యూరియా నిల్వలు, పంపిణీ విధానం, రైతుల అవసరాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.
కామారెడ్డి జిల్లా రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.
గత సంవత్సరం జూలై నెల వరకు కామారెడ్డి నియోజకవర్గానికి మొత్తం 140 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు గుర్తు చేసిన షబ్బీర్ అలీ, ఈ సంవత్సరం జూన్ 20వ తేదీ నాటికే 150 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు వెల్లడించారు.
ఇది గత సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల అని పేర్కొన్నారు.
అదనంగా రాబోయే రోజుల్లో మరింత యూరియా నిల్వలను జిల్లాకు తరలిస్తున్నామని, రేపు సాయంత్రం వరకు మేడ్చల్ నుండి
3,500 టన్నులు కూడా కొత్త స్టాక్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
రాష్ట్ర అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడారు.
రైతుల అవసరాలకు అనుగుణంగా నిరంతర సరఫరా కొనసాగుతుందని చెప్పారు.
కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం యూరియా కొరత ఉందంటూ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రైతులు అలాంటి ప్రచారాలను నమ్మకుండా అధికారులతో, వ్యవసాయ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
రైతులకు తగినంత యూరియా అందించడం ప్రభుత్వ బాధ్యత అని, రైతుల అవసరాలపై ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
జిల్లాలోని ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.
వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్న ఆయన, రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తమ వ్యవసాయ పనులను కొనసాగించాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…
బాధిత కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్…


