కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో శ్రీ గంగాదేవి దేవాలయం ప్రతిష్టాపర మహోత్సవం ఉత్సవాలులో భాగంగా గురువారం ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. యాగశాల ప్రవేశం, విగ్రహాల ఊరేగింపు, మంటప ప్రసాదం, 23న అగ్ని ప్రతిష్ట మూలమంత్ర అవణములు, సాయంత్రం విగ్రహాల ప్రతిష్టాపన, హారతి మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, 24న చండీ హోమం, విగ్రహాల మహన్నవనం నిర్వహించారు. 25న యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, 26న బోనాల ఊరేగించుట, సాయంత్రం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఐదు రోజులు జరిగే విగ్రహ ప్రతిష్ట , ప్రథమ వార్షిక ఉత్సవాలకు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి స్వామి, సాగర సంగం సభ్యులు లక్ష్మీనరసింలు, గౌట శంకర్, గంగాపుత్ర సుదర్శన సభ్యులు పాల్గొన్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


