బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం బండ రామేశ్వర పల్లి గ్రామంలో గ్రామస్తుల సహకారంతో గ్రామ దేవత మూర్తుల స్థిర ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గురువు ఆశీస్సులతో తుడిసి అరవింద్ శర్మ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు సంపూర్ణ సహకారం చేత గ్రామ దేవతామూర్తుల స్థిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రామ దేవత మూర్తులైన నల్ల పోచమ్మ,, ముత్యాలమ్మ,, మత్తడి పోచమ్మ,, దుర్గమ్మ, లక్ష్మమ్మ, నాయికమ్మ దేవత మూర్తులను గ్రామ ప్రజల ఆర్థిక సహకారంతో ఆలయాలు నిర్మించి విగ్రహ ప్రతిష్టన చేశారు. గురువారం రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, మహా అన్న ప్రసాదం, నాయకమ్మ బోనాలు సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు, 26 శుక్రవారం రోజున గ్రామంలో విందులో పాల్గొంటారని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ , బండ రామేశ్వర్ పల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


