కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 25 (అఖండ భూమి న్యూస్);
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ , జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర , అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఎన్.వి. గిరి తో కలిసి
పట్టణంలోని కీసాన్ అగ్రి మార్ట్ ఎరువుల దుకాణాన్ని, గోదాం ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించి, మిగిలిన స్టాక్ వివరాలను వెంటనే సంబంధిత యాప్‌లో నమోదు చేయాలని డీలర్‌కు ఆదేశించారు.
ఎరువుల విక్రయాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడంతో పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
అనంతరం అక్కడ ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి యూరియా లభ్యత, బుకింగ్ యాప్ వినియోగంపై ఆరా తీశారు. యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ చేసుకోవడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపడుతోందని తెలిపారు. ఎరువుల నిల్వలు,సరఫరా, విక్రయాల పై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, రైతులకు ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


