బాధిత కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 25 (అఖండ భూమి న్యూస్);
ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, ఆపదలో ఉన్న వారికి ధైర్యం చెప్పడం తన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పలువురు బాధిత కుటుంబాలను గురువారం పరామర్శించారు.
*లింగంపేట మండలం పరమల్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సాయికుమార్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పరమల్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నర్సింహులు భార్య , కుమార్తె ప్రమాదవశాత్తు మృతి చెందిన విషాద ఘటన పట్ల ఎమ్మెల్యే గారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి ఇంటికి వెళ్లి నర్సింహులు ని పరామర్శించి, కుటుంబానికి ధైర్యం చెప్పి తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు.
*నాగిరెడ్డిపేట మండలం మల్తుమేధ గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ అజ్జేమ్ , ప్రమాదవశాత్తు మృతి చెందిన సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందిస్తూ పార్టీ తన తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నేను , తోడుగా ఉంటాం అని ఎమ్మెల్యే తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


